19-03-2025 02:07:47 AM
సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ గుత్తా
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): శాసనమండలిలో మం గళవారం కీలకమైన నాలుగు బిల్లు లు ఆమోదం పొందాయి. ఒక బిల్లు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు, మరో బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు, తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థలు, ధర్మాదాయ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి.
బీసీ బిల్లులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలి లో ప్రవేశపెట్టగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహా, దేవాదాయ బి ల్లును మంత్రి కొండా సురేఖ సభ లో ప్రవేశపెట్టారు. వీటిపై సుదీర్ఘం గా చర్చించి సభ ఆమోదం తెలిపిం ది. మండలిలో కీలకమైన బీసీ బిల్లులకు ఆమోదం లభించడంతో మం త్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు, అధికార పక్షానికి, విపక్ష సభ్యులకు మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.