calender_icon.png 18 October, 2024 | 9:51 PM

నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్

18-10-2024 07:07:40 PM

1.5 కేజీ ల గంజాయి, ఒక వ్యాన్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం

వివరాలను వెల్లడించిన డిఎస్పీ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి కేసులో మరో నలుగురి అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ సర్కిల్  పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద 900 కిలోల భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా, ఎస్పీ గౌష్ అలం ఆదేశాల మేరకు ఆ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలించగా మహారాష్ట్రలో గోతిరాం గురుదయాల్ సాబ్లే, శుభం గోతిరాం సబ్లే, అమర్ సింగ్ నారాయణ గోతి, సోమనాథ్ బికా సాబ్లెలను  ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేసారు.

వీరి వద్ద ఒకటిన్నర కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ కేసు లో ప్రధాన సూతధారిగా ఉన్న మిగిలిన వారిని అరెస్టు చేయడానికి ఈ బృందం కార్యచరణను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వాహనంలో ఉండగా, ఒకరు గంజాయిని వ్యాపారంగా చేసుకునే వ్యక్తి గా డిఎస్పి తెలిపారు. నిందితులను పెట్టుకోవడంలో  కృషి చేసిన జైనథ్ సిఐ సాయినాథ్, రూరల్ సీఐ ఫనిధర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది రుక్మారెడ్డి, గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు.