22-03-2025 12:03:55 PM
నలుగురికి గాయాలు, ఒకరికి తీవ్ర గాయాలు
పెబ్బేరు: పెబ్బేరు మండలకేంద్రం సమీపంలో జాతీయ రహదారి 44పై శనివారం ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ లో పోలీస్ సీఐ గా పనిచేస్తున్న మురళీ కృష్ణ కుటుంబం కర్ణాటక రాష్ట్రం లో ఉన్న హంపిలో శుభకార్యం కు వెళుతున్న సందర్భంలో ప్రమాదం సంభవించింది. రహదారిపై కొబ్బరి బోండా ఉండటం గమనించిన డ్రైవర్ తప్పించటానికి ప్రయత్నం లో కారు అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న సీఐ భార్య భారతి, ఆమె కుమారుడు హరి చైతన్య,లతో పాటు చైతన్య మితృలు చైతన్య క్రిష్ణ, రిషి లకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి అంబులెన్స్ లో వనపర్తి ఆసుపత్రి కి తరలించారు. రిషి కి తీవ్ర గాయాలు కావడంతో స్తానిక 108 అంబులెన్స్ లో కర్నూలు లో ఆసుపత్రి కి తరలించారు.