calender_icon.png 27 January, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు హెకోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం

26-01-2025 12:50:36 AM

హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ రేణుక యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ ఈ తిరుమలాదేవి, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో శనివారం హైకోర్టు మొదటి హాలులో ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.

తొలుత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు ఇంచార్జి రిజిస్ట్రార్ జనరల్ చదవి వినిపించారు. జస్టిస్ రేణుక యారా మొన్నటి వరకు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, జస్టిస్ తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, బీఆర్ మధుసూదన్‌రావు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా సేవలందిస్తూ..

హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి సాధించారు. వీరితో హైకోర్టు పరిధిలో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఏపీలో ఇద్దరు హైకోర్టు జడ్జీలు..

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ అవధానం హరినాథశర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరర్‌సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ హరినాథశర్మ మొన్నటివరకు ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, జస్టిస్ డాక్టర్ లక్ష్మణరావు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలందించారు. వీరితో ఈ హైకోర్టు పరిధిలో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.