calender_icon.png 16 January, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం

01-07-2024 10:38:40 AM

మట్టి మిద్దె కూలి ఒక ఇంట్లో నలుగురు మృతి    

నిద్రలోనే ప్రాణాలు మట్టిలో

నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో విషాదం      

నాగర్ కర్నూల్,( విజయ్ క్రాంతి): గాడ నిద్రలో ఉన్న కుటుంబం ఒక్కసారిగా మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు మట్టిలోనే కలిసిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు మట్టి మీద కూలడంతో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గొడుగు భాస్కర్ గ్రామంలో సొంత ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఆదివారం రాత్రి రోజులాగే తన ఇంట్లో భార్య పద్మ (28), కూతుళ్లు తేజస్విని (పప్పీ) (7), వసంత (5), కుమారుడు రిత్విక్ (విక్కీ) (1)తో కలిసి రాత్రి భోజనం అనంతరం ఒకే ఇంట్లో పడుకున్నారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా  సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మట్టి మిద్దె ఒకసారిగా కూలి పడింది. దీంతో గొడుగు భాస్కర్ పైన ఫ్రిడ్జ్ పడటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా మిగతా అందరూ మట్టిలోనే కూరుకుపోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. గొడుగు భాస్కర్ ను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.