హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇనుప స్తంభాలు తీసుకువెళ్తున్న లారీ అదుపుతప్పి లారీ రెండు ఆటోలు, కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మామూనూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.