02-03-2025 12:16:59 AM
డెహ్రాడూన్, మార్చి 1: ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు కూలడంతో అందులో చిక్కుకున్న 55 మంది కార్మికుల్లో ఆర్మీ 50 మందిని రక్షించగా.. వారిలో నలుగురు మరణించారు. ఇంకా ఐదుగురు కార్మికులు ఆ చరియల కిందే ఉన్నారు. వీరిని కాపాడడటం కోసం ఆర్మీ ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తోంది.
బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై మంచును తొలగిస్తున్న సమయంలో మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు ఆ మం చు లో చిక్కుకున్నారు. ఆర్మీ అధికారులు శుక్రవారం 33 మందిని, శనివారం 17 మందిని కాపాడారు. ఇంకా ఐదుగురు కార్మికులు ఆ మం చులోనే ఉండగా.. కాపాడిన వారిలో నలుగురు మృతి చెందారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంత మంది పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని జోషిమఠ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మంచు చరి యలు విరిగిన ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీ. ఎత్తులో ఉంది.