calender_icon.png 1 April, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో నాలుగు రోజుల ఉగాది వసంతోత్సవాలు

29-03-2025 11:59:09 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లోనీ శిల్పారామంలో నాలుగు రోజుల ఉగాది వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం మోతలి పద్మప్రియ బృందం ఉగాది పండుగ పురస్కరించుకొని, రుతువులు, రాశులు, కోకిల రాగాలు, వసంతంకు సంబంధించిన పాటలు ఆలపించారు. వీరికి వల్లీదేవసేన, కళ్యాణి, ఫణిశ్రీ ,విజయలక్ష్మి గాత్ర సహకారం అందించారు. వెంకట శాస్ట్రీ కీబోర్డ్ శ్రీనివాస్ తబలా పై సహకరించారు.

అనంతరం ప్రసన్న మోహన్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో భాగంగా పుష్పాంజలి,పలుకే బంగారమాయెనా, వర్ణం, నటనమాడినారు, ఆనంద తాండవం, చారుకేశి కీర్తన, ఇట్టి ముద్దులాడి, దేవి స్తుతి, షియావ్ స్తుతి అంశాలను హాసిని, గాయత్రీ, తరుణీ, శ్రీవల్లి, గౌరీ, ప్రణవి, ఆశ్రిత, హాన్విత, వైశాలి, రూపశ్రీ, సంజన, శ్రీప్రియ మొదలైనవారు ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. కిరణ్మయి, కూచిపూడి నాట్య గురువులు ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను అభినందించారు. ఆదివారం ఉగాది పండుగ పురస్కరించుకొని సంపాదకులు, జ్యోతిష్యులు , ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి ఆచార్య సాగి కమలాకర శర్మ  చే  పంచాంగ పఠనం మరియు శ్రీమతి అపర్ణ ధూళిపాళ్ల శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.