calender_icon.png 12 March, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలిలో నాలుగు బిల్లులకు ఆమోదం

22-12-2024 01:31:06 AM

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): శాసనమండలి లో శనివారం నాలుగు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. మున్సిపాలిటీ సవరణ, జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిని విస్తరించేందుకు ఓఆర్‌ఆర్ పరిధిలోని 51 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు కూడా శాసన మండలిలో ఆమో దం పొందింది. అదేవిధంగా భూ భారతి బిల్లుకు కూడా శాసనమండలిలో ఆమోదం లభించింది.