నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిజామాబాద్ ఇన్చార్జి సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. నగరంలోని వినాయక్ నగర్ పంచముఖి హనుమాన్ మందిరం వెనుక రోడ్ నెంబర్ 7 ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ఇద్దరు విటులు, ఇద్దరు బాధితురాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి తెలిపారు. వారి వద్ద నుండి రూ.5900 నగదు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఏసీపీతో పాటు టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.