calender_icon.png 25 October, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో నలుగురు అరెస్టు

23-06-2024 12:05:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): మిత్రుల మధ్య మద్యం తాగేందుకు డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం చివరకు హత్య చేసే వరకు వెళ్లింది. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం మెహదీప ట్నంలోని తన కార్యాలయంలో వెల్లడిం చిన వివరాల ప్రకారం.. నాంపల్లి ఆగా పుర ప్రాంతానికి చెందిన షేక్ అలీ అలి యాస్ హలీం (31) హబీబ్‌నగర్ పీఎస్ పరిధిలో రౌడీషీటర్. అలాగే కార్వాన్‌కు చెందిన మహమ్మద్ ఉమర్ బిన్ హుస్సేన్ పెయింటర్. జిర్ర ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖాజా, మురాద్ నగర్‌కు చెందిన షేక్ ఫిరోజ్‌పాషా, ఆగా పుర ప్రాంతానికి చెందిన సయ్యద్ గౌస్ మిత్రులు. అయితే వీరందరూ కలిసి మద్యం సేవించేవారు. ఈ క్రమంలో ఉమర్ బిన్ హుస్సేన్‌ను మద్యం తాగేందుకు షేక్ అలీ డబ్బులు డిమాండ్ చేశాడు. హుస్సేన్ డబ్బులు ఇవ్వకపో వడంతో షేక్ అలీ బెదిరించాడు.

కాగా, ఈ నెల 19న రాత్రి 11 గంటల ప్రాంతంలో గౌస్, అలీ ఇద్దరూ కలిసి మల్లెపల్లి సమీపంలో మద్యం సేవిస్తున్నా రు. ఈ క్రమంలో షేక్ అలీ మద్యం సేవిస్తున్న సమాచారం మిగతా మిత్రుల కు తెలిసింది. వెంటనే ఆటోలో వచ్చి అతడిపై దాడి చేశారు. అంతేకాకుండా ఉమర్ బీన్ హుస్సేన్ కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలపాలైన షేక్ అలీని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం సంయుక్తంగా కలిసి నిందితులు మహమ్మద్ ఉమర్ బిన్ హుస్సేన్ (29), మహమ్మద్ ఖాజా(32), షేక్ ఫిరోజ్ పాషా(30), సయ్యద్ గౌస్(32)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.