calender_icon.png 22 December, 2024 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై దాడి నలుగురీ అరెస్ట్

21-12-2024 08:38:46 PM

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు. గ్రామంలోని శ్మశాన వాటిక ప్రాంతంలో శనివారం సాయంత్రం పేకాటాడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించమన్నారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.11,540 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.