హైదరాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్, తహశీల్దార్ పైవ జరిగిన దాడి ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు 46 మందిని నిందితులుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. భోగమోని సురేష్ ఏ-1గా, ఈ ఘటనలో మంగళవారం 16 మందిని అరెస్టు చేసినట్లు రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. గ్రామాస్తులు దాడి చేయడంతో కలెక్టర్, అధికారులు, పోలీసులకు గాయాలు కావాడంతో దాడి, హత్యాయత్నంపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రధాన నిందితుడు సరేష్ సోదరుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను నలుగురిని వైద్య పరీక్షల కోసం పరిగి సర్కార్ దవాఖానకు తరలించారు.