calender_icon.png 9 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లష్కర్ మహంకాళి ఆలయ సంస్థాపకులు

22-08-2024 12:00:00 AM

సురిటి అప్పయ్య ముదిరాజ్ - 

తెలంగాణ ప్రాంత పది జిల్లాలలోని తమ తమ బంధువులను హైదరాబాద్‌కు ఆ హ్వానించుకొని ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకు నే పండుగ ‘లష్కర్ బోనాలు’. లక్షల కోట్లమంది ఆ రాధ్యదైవమైన ఉజ్జయిని మహంకాళి మాతకు ఘనంగా సమర్పించుకొనే బోనాలు కోరుకునే కో ర్కెలు, తీర్చుకునే మొక్కులు. మన హైద్రాబాద్ సం స్కృతి, సంప్రదాయాలలో ముఖ్యమైన ఉజ్జయిని మహంకాళి జాతర మన లష్కరుకు ఎట్లా వచ్చిం ది? తెలంగాణ ప్రజలకు ఆ భాగ్యం కల్పించిన మ హనీయుడు ఎవరు? ఆయనే ఆధ్యాత్మిక దార్శనికుడు సురిటి అప్పయ్య ముదిరాజ్. నేడు మహా తల్లిని దర్శించుకొని ధన్యమవుతున్న లక్షలమంది సురిటి అప్పయ్య ముదిరాజ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ లష్కర్‌లోని ఒకానొక సామాన్య కు టుంబం సురిటి అప్పయ్య ముదిరాజ్ కుటుంబం. కొంచెం అక్షరజ్ఞానంతో బ్రిటిష్ ఆర్మీలో చేరాడు సు రిటి అప్పయ్య. క్రీ.శ. 1813 ప్రాంతంలో బర్మా, బ్రి టిష్‌ల మధ్య జరుగుతున్న యుద్ధ సమయం. కొం త బ్రిటిష్ ఆర్మీని సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ పట్నానికి తరలించారు. అందు లో ఆర్మీ బేరర్ మన అప్పయ్యకూడా ఉన్నారు.

కలరా వ్యాధి సోకి ఉజ్జయినీ పట్టణంలో అనేకమంది చనిపోతున్నారు. భయకంపితులైన జనాల లో మిలిటరీ బ్యారక్ అధికారులు, సిపాయిలు కూ డా ఉన్నారు. భక్తి విశ్వాసం మెండుగా వున్న మిలటరీ సిపాయి అప్పయ్య ముదిరాజ్ ఉజ్జయినీ మ హంకాళి మాతను వేడుకున్నాడు. “తల్లీ! ఈ మారణకాండ నుండి మానవులను రక్షించు. తల్లీ.. నీకు ఘనంగా మొక్కులు చెల్లించుకుంటా” అంటూ వేడుకున్నాడు. ముదిరాజు తన కోసం కాదు, పూర్తి సమాజ రక్షణకు అమ్మను వేడుకున్నాడు. ఆ అమాయక భక్తుని మొరను ఆలకించిన మహాతల్లి మారణాగ్నిని చల్లర్చింది. ఉజ్జయినీ జనం ఊపిరి పీల్చుకున్నారు. అప్పయ్య అమ్మవారిని దర్శించుకొని ఘనంగా పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నాడు. ఇంతటి మహత్తర శక్తిగల ఈ మహాతల్లికి లష్కర్‌లో గుడి నిర్మించాలని అక్కడే ఆ ఉజ్జయినీ మాత మందిరంలోనే సంకల్పానికి వచ్చాడు.

అసామాన్యమైన అమ్మవారి ప్రతిమను అప్ప య్య తానే స్వయంగా కలప కళాకారుడై చెక్కాడు. ఈ రకంగా విశేషమైన భక్తిశ్రద్ధలను చాటుకున్నా డు. తాను స్వయంగా కళాకారుడు కాదు. కుంచె ప ట్ట లేదు. తొలిచె ఉలి అంతకంటే పట్టుకోలేదు. అ మ్మవారు అప్పయ్యలో అన్నీ తానై తన ప్రతిమను తానే చేయించుకొన్నదని ఆ రోజుల్లో భక్తులు చెప్పుకునేవారు. క్రీ.శ. 1815లో ఇప్పుడు లక్షలమంది భక్తులు ఆరాధిస్తున్న పుణ్యస్థలంలోనే అమ్మవారిని, తాను చెక్కిన కలప దేవతను ప్రతిష్ఠించిండు సురిటి అప్పయ్య ముదిరాజ్. నాటినుండి నిత్యపూజలతో విరాజిల్లుతూ లష్కర్ బోనాల పేర ఖండాతరంలోని జనహృదయాలలో నిలిచింది సికింద్రాబార్‌లో కొలువైన శ్రీ ఉజ్జయినీ మహాకాళి మాత.

1815 నుండి 1866 వరకు అమ్మవారు అదే కల ప విగ్రహానికే నిత్యపూజలు అందుకున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు అన్నీ వైభవంగా జ రిగాయి. 1866లో కలప విగ్రహం స్థానంలో శాస్త్రీ య పద్ధతిలో శిలా విగ్రహం ప్రతిష్ఠించారు. నేటికి 151 సంవత్సరాలుగా సంప్రదాయ పద్ధతిలో వైదిక ఆగమ శాస్త్రానుసారం నిత్యపూజలు జరుగుతున్నా యి. 209 సంవత్సరాలు సురిటి అప్పయ్య ముదిరాజ్ కుటింబీకులు ధర్మకర్తలుగా కొనసాగుతున్నా రు. ప్రతి సంవత్సరం వీరు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అప్పయ్య ముదిరాజ్ తర్వాత వారి అయిదు తరాలలో సంజీవయ్య ముదిరాజ్, లక్ష్మ య్య ముదిరాజ్, కిష్టయ్య ముదిరాజ్, లక్ష్మయ్య ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్‌లు ఉన్నారు. ప్రస్తుతం సురిటి కామేష్ ముదిరాజ్ ఆరో తరం ఆలయ ధర్మకర్తగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి పండుగ కా ర్యరచనలో అప్పయ్య, ‘పండుగ మా అందరిది’ అ నుకునే శైలిలో కార్యప్రణాళిక రూపొందించారు. అమ్మవారి ఊరేగింపు మొదలుకొని ఘటోత్సవం, బోనాలు, రంగం, బలి, గావు, ఘటం వీడ్కోలు మొ దలైన పర్వాలు క్రమపద్ధతిలో ఏర్పరిచారు. కులాలుగా విభజితమైన హిందూ సమాజాన్ని ప్రత్యేకిం చి శ్రామిక వర్గాలైన శూద్రులను, అతిశూద్రులను ఈ వేడుకలోని పనుల విభజనలో మమేకం చేసి కలిపి నడిపించాడు అప్పయ్య ముదిరాజ్. అతిశూ ద్ర కన్యను అమ్మవారి ఉపాసకురాలిని చేశారు.

ఆ మెకు ప్రతిరూపంగా మాతంగ కన్యను రంగమెక్కిం చి భవిష్యవాణిని సమాజానికి వినిపించిన అప్ప య్య ముదిరాజ్ వారి సామాజిక దూరదృష్టి అభినందనీయం. అంటరానితనంపై అప్పయ్య చేసిన ప్ర యోగం చాలా గొప్పది. సమసమా జ స్థాపనకై ఆయన చేసిన సాహసం అనిర్వచనీయం. అమ్మవారి నిత్యారాధన సంవత్సరంలో ఒకసారే ఆషాఢమాసంలో జరుపుకొనే దివ్య మహోత్సవం అదే బోనాల జాతర. లక్షలమంది పాల్గొనే ఈ జాతర ఏర్పాట్లు నాటినుండే పని విభజనతో అన్ని కులాలు మమేకమై తమ కులదైవంగా అమ్మవారిని కొలుస్తున్నారు.

గుడి శుభ్రత ఎవరు చేయాలి? బట్టలు శుభ్రపరుస్తూ ఎవరు అలంకరించాలి? అమ్మవారి నగలు ఎవరు చేయాలి? అమ్మవారి చేతబూనిన ఆయుధాలు ఎవరు చేయాలి? లక్షలాదిగా తరలివచ్చే భక్తులు సమర్పించే బోనాలు అమ్మవారికి ఎవరు చూపాలే? ఆయా శ్రమైక జీవుల వృత్తుల ప్రతిపాదికన పనులు అప్పగించడం సురటి అప్పయ్య సామాజిక దృక్పథానికి తార్కాణం. తరాలుగా అమ్మవారి సేవలో తమకు అప్పగించిన సేవలు నిర్వహిస్తూ తరిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు. హైద్రాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలలో మహంకాళి దేవాలయాలు 1917లో లాల్ దర్వాజ మహంకాళి దేవాలయం, ముషీరాబాద్ మహంకాళి దేవాలయం, శ్రీమూర్తులను కొలిచే వివిధ దేవాలయాల ఏర్పాటుకు స్పూర్తిని నింపింది సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయమే.

 డా॥ బండా ప్రకాశ్ ముదిరాజ్,

అధ్యక్షులు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ