నిర్మల్ (విజయ క్రాంతి): మార్మూల గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు అదిలాబాద్ ఎంపీ నాగేష్ అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బొజ్జి పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గిరిజన గుడాలకు గ్రామాలకు విద్యుత్తు రవాణా వైద్యం విద్య వంటి సౌకర్యాలను చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.