calender_icon.png 24 February, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్ధాపన..

21-02-2025 04:30:00 PM

మునగాల: మండలంలో తాడ్వాయి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ‍పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్ధాపన చేసి ముగ్గులు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ హౌసింగ్ అధికారి మూర్తి, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, ఎంపిఓ దార శ్రీనివాస్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి వసంత, కార్యదర్శి రామానాయక్, మాజీ వైస్ ఎంపిపి కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వట్యావుల సైదులు, గట్టు ఉపేందర్ రావు, కొండమీది గుర్వయ్య, సోమపంగు గోపి, కొల్లిశేట్టి నాగరాజు, భూక్యా బిక్షం, సూతరి మేస్త్రిలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.