25-03-2025 06:21:03 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని పోచారం తండాలో మంగళవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో భాగంగా 10 లక్షల రూపాయలతో పోచారం తండాలో సీసీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేయబడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా పెద్ద కొడప్గల్ మండలానికి గ్రామానికి నిధులు ఇచ్చినందుకు గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మషనప్ప పటేల్, శామప్ప పటేల్, బంతిలాల్, నాగరాజ్, పడవాల్ బచ్చన్, కానా నాయక్, నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.