10-04-2025 12:45:39 AM
భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మాల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 9 : గ్రంధాలయ భవన నిర్మాణానికి అమెజాన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ (పెత్తుల) గ్రామంలో గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సహకారంతో గ్రంధాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజల సమస్యలే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని, పేద ప్రజ ల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల వల్ల ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అక్షరం ఆయుధంగా అందరికీ అందించడంమే లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బత్తుల రామ్ రెడ్డి, సత్తు శశాంక్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు. దోమ సుదర్శన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు కోడూరు పాండు, బోడో మహేందర్, బోడ విజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకు లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.