calender_icon.png 12 March, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.49 కోట్ల సీసీ రోడ్లకు శంకుస్థాపన

12-03-2025 01:03:26 AM

అశ్వారావుపేట, మార్చి 11(విజయక్రాంతి) : అశ్వారావుపేట నియోజక వర్గ పరిధిలోని దమ్మపేట మండలంలో  స్థానిక ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ రూ. 1.49 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. 

మండలం లోని జమేదార్ బంజర్, పార్కలగండి, బాలరాజుగూడెం, జగ్గారం, అంకంపాలెం, ఆర్లపెంట  పూసుకుంట గ్రామపంచాయ తీలలో రోడ్ల పనులు ప్రారంభించారు.  ఈ పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.