30-03-2025 11:15:37 PM
వేంసూరు (విజయక్రాంతి): మండలంలో కల్లూరు గూడెం గ్రామంలో నూతన పామాయిల్ ఫ్యాక్టరీకీ శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి నుండి వేంసూరు మీదుగా కల్లూరు గూడెం గ్రామం వరకు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు, రైతు సోదరులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చిన తుమ్మల పామయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనతో రైతుల ఇంట సంబరాలు ఫ్యాక్టరీకీ అవసరం అయ్యే రహదారి భూమిని అందించిన రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.
శంకుస్థాపన సభ ప్రాంగణంలో వేలాదిగా పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులు, మహిళలు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఆయిల్ ఫేడ్ సంబంధిత అధికారులు, సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం, పెనుబల్లి మండలం, కల్లూరు మండలం, తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు పాల్గొన్నారు.