calender_icon.png 6 April, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన

05-04-2025 09:07:16 PM

చెన్నూర్,(విజయక్రాంతి): ఇందిరమ్మ గృహాలకు నియోజక వర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన బొప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తర్వాత కోటపల్లి మండల కేంద్రంలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన, మల్లంపెట్, నక్కలపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం చెన్నూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గంలోని ఆయా మండల అధ్యక్షులతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మీటింగులో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ తెలియజేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.800 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందని, మంచి విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు.