calender_icon.png 23 February, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

23-02-2025 02:48:20 PM

తరిగొప్పుల(జనగామ),(విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో దుర్గమ్మ గుడి  ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌(Constitution Architect Dr. Babasaheb Ambedkar) విగ్రహం ఏర్పాటుకు ఆదివారం ఉదయం అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాతా బాలయ్య(Ambedkar Association President Khata Balayya) ఆధ్వర్యంలో దళిత నాయకులు, మరియు గ్రామస్తులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ. ఆయన ఆలోచన విధానాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలని అని తెలిపారు.

అదేవిధంగా అంబేద్కర్‌ అమర్‌రహే... జోహర్‌ అంబేద్కర్‌... అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళితులు చింతల ఎల్లయ్య, చింతల రమేష్, చింతల బాబు, ఖాతా బాలయ్య, ఖాతా సందీప్, పరుశరాములు, బాల కిష్టయ్య , వెంకన్న, తుర్కపల్లి ఆనందం, విజయ, భోగ శీను, ఉప సర్పంచ్ భాష బోయిన రాజు, మాజీ ఎంపిటిసి తాళ్లపల్లి రాజేశ్వర్, నీల సంపత్, మూలా ఆనందం, మూల రాములు, నీల రాజు అర్జుల సంపత్, మూల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.