calender_icon.png 19 April, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

18-04-2025 12:14:24 AM

మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి గ్రామంలో దేవాలయాల్లో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర స్వామి, విష్ణు దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది.

ఈ నిధులతో రెండు రాజగోపురాలు, పుష్కరిణి, నిరాలి మండపం, పుష్కర ఘాటు వంటి అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వజ్రేస్ యాదవ్ మాట్లాడుతూ ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.

నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.