ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రూ.1.68 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పటాన్‌చెరు,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో రూ.1.8కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖాణ భవనం, మూడు ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ.60లక్షల జీపీ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలెల దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. ప్రతి పల్లె దవాఖానలో వైద్యుడు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని చెప్పారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండు, ఎంపీవో హరిశంకర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ హరిప్రసాద్‌రెడ్డి, రాజు, వెంకన్న, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల అభివృద్ధికి పెద్దపీట
క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. శరవేగంగా విస్తరిస్తున్న ముత్తంగి గ్రామ పరిధిలో క్రీడా ప్రాంగణం చాలా ముఖ్యం అన్నారు. వివిద రకాల క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, గడీల శ్రీకాంత్‌గౌడ్, శ్రీనివాస్, మేరాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.