11-03-2025 12:40:42 AM
సత్తుపల్లి, మార్చి 10 (విజయ క్రాంతి) : సత్తుపల్లి, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సోమవారం శంకుస్థాపన చేశారు.కిష్టారం గ్రామం లో 70 లక్షలు రూపాయలు ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు, వేంసూర్ మండలం యర్రగుంట పాడు గ్రామం లో 94 లక్షలు రూపాయల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోఎస్టీ -ఎస్సీ సబ్ ప్లాన్ కింద మొత్తం 23 కోట్ల 81 లక్షలు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలియజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రెటెడ్ స్కూల్ ను 200 కోట్ల రూపాయలు తో చేపట్టడం జరిగింద న్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు తుమ్మలకి, పొంగులేటి కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.
యర్రగుంటపాడు గ్రామ అభివృద్ధి కీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు ప్రజలకు అందిస్తుందని, త్వరలో నూతన పథకాలు ప్రజలకు అందుతాయని ఎమ్మెల్యే తెలియజేసారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కీ సహకరిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ గారికి, ఖమ్మం జిల్లా మంత్రివర్యులు కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, తహసీల్దార్ ,ఎంపీడీఓ,స్పెషల్ ఆఫీసర్, పి ఆర్ డి ఈ ,ఏ ఈ , ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి, వేంసూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.