హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): ఆదిభట్ల మున్సిపాలిటీ చివరి సమావేశంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి శనివారం సుమారు 5కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొంగర, బొంగులూరు, పటేల్‌గూడెం, రామదాసుపల్లి, మంగళపల్లి, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాత గ్రామాలలో 20 శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సంద మర్రి నిరంజన్‌రెడ్డిని మున్సిపల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.