శ్రీరంగాపురం జనవ రి 18 : మండలం పరిధిలో కంబాలపురం గ్రా మంలో సిసి రోడ్డు నిర్మా ణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యా లయంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివా రం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పార్వతమ్మవెంకయ్య, నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ వాసుదేవారెడ్డి, తాసిల్దార్, ఎంపీడీవో, పంచాయతీరాజ్ డిఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.