22-03-2025 07:17:30 PM
అభివృద్ధి అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చే మొదటి పేరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
వేంసూరు (విజయక్రాంతి): నియోజకవర్గంలో ఇప్పటివరకు పామాయిల్ సాగు సుమారుగా 6 వేల నుండి 7 వేల ఎకరాల వరకు సాగులో ఉంది. పామాయిల్ సాగు అధికంగా ఉండటం వల్ల మండల పరిధిలో కల్లూరు గూడెం గ్రామంలో సుమారుగా 42 ఎకరాలలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసినదే. పామాయిల్ ఫ్యాక్టరీకి చేరుకోవడానికి ఆర్ అండ్ బి రోడ్డు నుండి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశం వరకు సుమారుగా 1200 మీటర్ల పొడవు గల రోడ్డు మార్గానికి అవసరమైన భూమీ స్వీకరించి అట్టి భూమిలో డబల్ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉగాది పండుగ రోజు పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని సమాచారం. శంకుస్థాపన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తుమ్మూరు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కాసార చంద్రశేఖర్ రెడ్డి, వెల్ది జగన్మోహన్ రెడ్డి పుచ్చకాయల సోమిరెడ్డి పాల్గొన్నారు.