07-03-2025 01:18:35 AM
భీమదేవరపల్లి మార్చ్ 6( విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భీమదేవరపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీరేశం శంకుస్థాపన చేశారు. భీమదేవరపల్లి గ్రామంలో మొత్తం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు 460 దరఖాస్తులు రాగా 160 మంది అర్హులను ఎంపిక చేసినట్లు తెలిపారు. భీమ దేవరపల్లి గ్రామంలో నేటి వరకు 6 ఇళ్లకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు మిగతా ఇల్లు దశలవారీగా శంకుస్థాపన చేస్తామని అన్నారు.