calender_icon.png 16 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఇల్లెందులో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంఖుస్థాపన

15-03-2025 08:59:59 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందులో నిర్మించతలపెట్టిన వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర గృహనిర్మాణ, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఆదివారం శంఖుస్థాపన చేయనున్నారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలంలో మంత్రి పర్యటన ఖరారైంది. ఉదయం ఎనిమిది గంటలకు ఇల్లందు మండలం పూబెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. అనంతరం జేకే బస్సు స్టాఫ్ సమీపంలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఆర్ అండ్ బి రోడ్ నుంచి బొయితండాకు బీటీ రోడ్ నిర్మాణానికి, రొంపేడు చెక్ పోస్ట్ నుంచి మిట్టపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణానికి, కోటిలింగాల క్రాస్ నుంచి మామిడిగుండాల బీటీ రోడ్ పనులకు శంఖుస్థాపన చేస్తారు.