24-03-2025 04:29:59 PM
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి..
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జగన్నాధపురం గ్రామంలో సోమవారం కోదాడ ఎమ్మెల్యే యన్ పద్మావతి రెడ్డి సహకారంతో యన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామాని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నలమాద మాల్సూర్, గ్రామ శాఖ అధ్యక్షులు వై మల్లయ్య, కలకోవ గ్రామ శాఖ అధ్యక్షులు పనస శంకర్, మాజీ ఉప సర్పంచ్ యన్ నరేష్, వార్డు సభ్యులు వెంపటి నర్సయ్య, గౌస్, విజయలక్ష్మి, రమేష్, లింగరాజు పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.