17-03-2025 05:06:45 PM
పెద్దకొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలో సోమవారం ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 30 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు పెద్దకొడఫ్గల్ గ్రామంలోని శివాలయం నుండి స్టేట్ నేషనల్ హైవే 161 రోడ్ వరకు భూమి పూజ నిర్వహించారు. ఈద్గా నుండి శివాలయం రోడ్డు వరకు కలపడం జరుగుతుంద అన్నారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్లు పనులు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా నిధులు పెద్ద కొడఫ్గల్ మండలానికి గ్రామానికి ప్రత్యేకంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు ఇచ్చినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు చిప్ప మోహన్, అక్కలి సాయి రెడ్డి, శామప్ప, డాక్టర్ సంజీవ్, బసవరాజ్ దేశాయ్, టీ శ్రీనివాస్ గౌడ్, కల్లూరి పండరి, విట్టల్, మైనారిటీ నాయకులు జాఫర్ షా, తదితరులు పాల్గొన్నారు.