12-03-2025 01:34:11 AM
న్యూలాండ్ పరిశ్రమ సహకారం
పటాన్‌చెరు, మార్చి 11 : మండల కేంద్రం జిన్నారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.55లక్షలతో చేపట్టే నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణానికి మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ న్యూలాండ్ పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.
పాఠశాలకు అసవరమైన నాలుగు తరగతి గదులను నాలుగు నెలల్లో నిర్మిస్తామని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన పరిశ్రమ ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలను కల్పించిందన్నారు.
గ్రామాల అభివృద్దికి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు పరిశ్రమ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు శారద, రవికుమార్, జిన్నారం గ్రామ నాయకులు, పాఠశాల హెచ్ ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.