ఐటీడీఏ పీవో రాహుల్..
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన బాలబాలికలకు ఉద్దీపకం బుక్లెట్స్ ద్వారా పునాది నుండే విద్యాభ్యాసం మెరుగుపడే విధంగా మూడు రకాల బుక్లెట్స్ సిద్ధంగా ఉన్నాయని, అన్ని పాఠశాలలకు సరఫరా చేయడం జరుగుతుందని, ఈ బుక్లెట్లోని అంశాల ద్వారా బాలబాలికలు సులభంగా అర్థం చేసుకొనే విధంగా విద్యా పరంగా వారి యొక్క మేధాశక్తిని పెంపొందించుకుంటారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు గిరిజన సంక్షేమ శాఖ జిపిఎస్ పాఠశాలల్లో ఉద్దీపకం బుక్ లైట్స్ను పిల్లల చేత దాంట్లోని అంశాలను వారిచేత చదివించి దానికి సంబంధించిన అర్థాలను వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఉద్దీపకం బుక్లెట్స్ తెలుగు ఇంగ్లీష్ గణితం సంబంధించిన తేలికైన పదాలతో రూపొందించడం జరిగిందని ఈ బుక్లెట్స్ ద్వారా బాలబాలికల యొక్క మేధాశక్తిని వారిలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకోవడమే కాక చదువు పట్ల వారు మక్కువ కలిగేలా చేయవచ్చని ఆయన అన్నారు. అనంతరం పాఠశాలలోని బాలబాలికలకు ఉద్దీపన పుస్తకాలు అందించారు.