calender_icon.png 11 October, 2024 | 2:55 PM

నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన

11-10-2024 01:04:05 AM

కొందుర్గ్‌లో రేవంత్ రెడ్డి, మధిరలో భట్టి  

తొలి విడుతలో 28 పాఠశాలల నిర్మాణం

వీటికోసం ఈ ఏడాది 5 వేల కోట్లు ఖర్చు 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యంగ్ ఇండియా- ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్ నిర్మాణం ప్రక్రియలో కీలక ముందడు గు పడబోతోంది.

బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గానికి -ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి విడత కింద శుక్రవారం 28 పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. 

షాద్‌నగర్ కొందుర్గ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శంకుస్థాపన ఏర్పాట్లపై సంబంధిత జిల్లాల కలెక్టర్లతో గురువారం సాయంత్రం సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

కార్యక్రమానికి ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని దిశానిర్దేశం చేశారు. స్కూళ్లను ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో నిర్మిస్తారని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అజిత్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు. 

శంకుస్థాపన జరిగే నియోజకవర్గాలు ఇవే.. 

కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొం డ, హుజూర్‌నగర్, మంథని, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట, ములుగు, జడ్చర్ల, పాలే రు, ఖమ్మం, వరంగల్,  కొల్లాపూర్, అంధో ల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి

అత్యాధునిక సౌకర్యాలతో 

28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండి యా- ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తయ్యింది. స్కూళ్ల ను అత్యాధునిక సౌకర్యాలతో కట్టడానికి ఈ ఏడాది ప్రభుత్వం రూ.5 వేల కోట్లను ఖర్చు చేయనుంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో దశలో మిగతా నియోజకవర్గాల్లో  స్కూళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఒక్కో స్కూల్‌ను 20 ఎకరాలకు తగ్గకుండా నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో ఇంటర్ వరకు బోధన, వసతి సౌకర్యం ఉండేలా నిర్మిస్తారు. 

నేడు కొందుర్గకు సీఎం

రంగారెడ్డి, ఆక్టోబర్ 10(విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో శుక్రవా రం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నా రు. మండల కేంద్రంలో మద్యాహ్నం 1 గంటలకు ఇంటిగ్రేటేడ్ స్కూల్ కాంప్లెక్స్ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ  నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ శశాం క, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొందుర్గులో గురువారం పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వివిధ శాఖల అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. సీఎం పర్యటనలో నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొంటున్నారు.