calender_icon.png 31 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శేరిలింగంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

31-01-2025 08:07:29 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి బీహెచ్ ఈఎల్ చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాల వరకు ఆర్ సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ అరేకపూది గాంధీ మాట్లాడుతూ... ఎస్ ఎన్ డీపీ ఫేస్ 2లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల అంచనా వ్యయంతో నాలల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా తారనగర్ కాలనీలో గల సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి బీహెచ్ ఈఎల్ చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాల వరకు విస్తరణ, ఆర్ సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు, ఆర్ సీసీ బెడ్, సైడ్ వాల్స్, నాల విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు.

నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని, ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇబ్బందులకు గురయ్యేవారని, కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందని, ప్రజల అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యతలో విస్తరణ పనులు చేపట్టాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని పీఏసీ చైర్మెన్ అధికారులను ఆదేశించారు.