21-01-2025 11:27:17 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని 21వ వార్డులో లక్షల వ్యయంతో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించామన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. స్థానిక కౌన్సిలర్ నా రెడ్డి కృష్ణవేణి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, నా రెడ్డి రవీందర్ రెడ్డి, కమిషనర్ బి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.