26-04-2025 12:10:17 AM
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహణ
హైదరాబాద్‌సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో శుక్రవారం ఫౌండేషన్‌డే వాక్ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం ఈ వాక్‌ను ప్రారంభించగా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ వరకు వాక్ కొనసాగింది. ఇంజనీరింగ్ కాలేజీ ఎదుట పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వీసీ కుమార్ మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, దేశాన్ని అస్థిరపరిచే చర్య విమర్శించారు. కార్యక్రమంలో ఓయూ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ వేడుకలను నేడు నిర్వహించనున్నారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా లోక కవి అందెశ్రీ హాజరుకానున్నారు.