03-04-2025 12:56:37 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ ఐఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి, కరీంనగర్ జిల్లాలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్లకు చాలా డిమాండ్ ఉంది.
అడ్మిషన్ల కోసం పోటీ పడుతారు. ఈ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు అకడమిక్ సిలబస్‌తో పాటు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి ప్రవేశ పరీక్షల్లో శిక్షణ ఇస్తుండటంతో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తమ ర్యాంకు లు సాధిస్తున్నారు.
ఈ కళాశాలల్లో విద్యనందిస్తున్న తరహాలోనే రాష్ట్రంలోని మరో 10 సాంఘిక సంక్షే మ గురుకుల కళాశాలలను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా కాళాశాల్లో ఫౌండేషన్ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్రంలో మొత్తం 238 సంక్షేమ గురుకుల కాలేజీలు ఉండగా వాటిలో తొలుత పది కళాశాలల్లో 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.
నీట్, ఐఐటీ, జేఈఈతోపాటు క్లాట్, సీయూఈటీ, యూపీఎస్సీ వంటి కీలకమైన పోటీ, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు జాతీ య, రాష్ట్రస్థాయిలో రాణించే అవకాశముంటుందని టీజీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యద ర్శి డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రస్తు తం చదివే విద్యార్థులకు అంటే 2025-2026 (8వ తరగతిలో చేరేవారు) విద్యాసంవత్సరంలో ఈ ఫౌండేషన్ కోర్సులపై ఆసక్తి ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు ఒక ప్రవేశ పరీక్షను నిర్వహించి, మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.