calender_icon.png 17 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి

17-11-2024 03:14:44 AM

తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్

జనగామ, నవంబర్ 16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్‌ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ముదిరాజ్ మాసభ దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను శనివారం హనుమకొండలో ని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. చెరువులు, కుంటలపై ముదిరాజ్‌లకే పూర్తి హక్కులు ఉండేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బండి సారంగపాణి, భూపాలపల్లి అధ్యక్షుడు జోరుక సదయ్య, జనగామ అధ్యక్షుడు నీల గట్టయ్య, సహకార సంఘం చీఫ్ ప్రమోటర్లు బుస్సా మల్లేశం, చొప్పరి సోమయ్య, నీల రాజు, ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ శానబోయిన రాజ్‌కుమార్ పాల్గొన్నారు.