calender_icon.png 31 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఓవర్‌లో 43 పరుగులు

27-06-2024 05:11:24 AM

రాబిన్‌సన్ చెత్త రికార్డు

లండన్: ఇంగ్లండ్ పేసర్ ఒలీ రాబిన్‌సన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగం గా.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు సమర్పించుకున్న ఒలీ రాబిన్‌సన్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. డివిజన్ లీగ్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాబిన్‌సన్.. లిస్టర్‌షైర్‌తో పోరులో ఈ చెత్త గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు.  రాబిన్‌సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో 43 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇందులో మూడు నోబాల్స్ కూడా ఉన్నాయి. రాబిన్‌సన్ వేసిన 13వ ఓవర్‌లో 6,6+నోబ్, 4,6,4, 6+నోబ్,4,6+నోబ్,1 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఓవర్ ప్రారంభానికి ముందు 72 పరుగులతో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్ కింబర్.. రాబిన్‌సన్ బౌలింగ్‌ను ఉతికి ఆరేసి 109 పరుగులో ఓవర్ ముగించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు న్యూజిలాండ్ బౌలర్ బెర్ట్ వెన్స్ (77) పేరిట ఉంది.