- ఆర్మూర్‌లో 20 ఏళ్ల వరకు ఎద్దడి ఉండబోదు
- ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి
నిజామాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టే పనులకు అమృత్ పథకం కింద రూ.43 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినట్లు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూ ర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి ఆర్మూర్ పట్టణంలో పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలించారు.
ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన జనాభా అవ సరాలకు అనుగుణంగా కొత్త ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులు పూర్తుతై మరో ఇరవై ఏళ్ల వరకు ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కీట్, మామిడిపల్లి ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవ సరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదన్నారు. వారివెంట ఉర్డూ అకాడమి చైర్మన్ తాహెర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్‌దేవి లావణ్య, డీసీసీబీ చైర్మన్ రమేష్‌రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో రాజగౌడ్ ఉన్నారు.