calender_icon.png 22 January, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే క్రీడా పాలసీ రూపకల్పన

30-08-2024 12:00:00 AM

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ వేడుకలను  ఘనంగా నిర్వహించింది.  మంత్రి శ్రీధర్ బాబు మాట్లా డుతూ.. క్రీడలు, క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడా పాలసీని రూపొంది ంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే సామ ర్థ్యం గల క్రీడాకారులను తయారు చేసేందుకు త్వరలో ప్రారంభించనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పోర్ట్స్ స్కూల్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలి పారు. వేడుకల్లో మంత్రి సీతక్క, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.