* మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ రాజభక్తిని, స్వామిభక్తిని ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో జూబ్లీహిల్స్ సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లో బహిరంగ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మా ట్లాడారు.
శాసనసభలో చర్చ పెడతామంటే ప్రభుత్వం ఎందుకు అనుమతించ లేదని, ఇప్పటికైనా ప్రసార మాధ్యమాల సమక్షంలో బహిరంగ విచారణకు సిద్ధమని, దమ్ముంటే చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ ఒప్పందం విషయంలో కేటీఆర్‌పై ఏసీబీ పెట్టింది తప్పుడు కేసు అని, విచారణ సంస్థలు విచారణ ప్రక్రియ సక్రంమంగా నిర్వహించడమే కాకుండా అది నిస్పక్షపాతంగా జరుగు తున్నట్టు ప్రజలు భావించేలా చూడటం వాటి బాధ్యత అని పేర్కొన్నారు.
హైకోర్టులో తీర్పు రిజర్వు చేసిన ప్రస్తుత పరిస్థితిలో ఏసీబీ కేటీఆర్‌ను విచారణకు పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విచారణ సంస్థను గౌర వించి కేటీఆర్‌తోపాటు న్యాయవాదులను అనుమతించక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఏసీబీకి ఎలాంటి దురు ద్దేశం లేకపోతే న్యాయవాదులను ఎందుకు అనుమతించలేదని నిలదీశారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు.