- కేటీఆర్, అర్వింద్, బీఎల్‌ఎన్‌కు నోటీసులు సిద్ధంచేస్తున్న ఏసీబీ!
- దానకిషోర్ నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్, డిసెంబర్25 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కారు రేస్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సం బంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి త్వరలో నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి హెచ్‌ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ కు పిలుస్తారని సమాచారం. ఫార్ములా ఈ- కారు రేస్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని దానకిషోర్ ఇదివరకే తన ఫిర్యాదులో పేర్కొన్నా రు.
ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించారని వెల్లడించిన నేపథ్యం లో దానకిషోర్ వాంగ్మూలాన్ని మంగళవార ం ఏసీబీ రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆయన నుంచి కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సుమారు ఏడు గంటలకు పైగా దాన కిషోర్ ను ఏసీబీ అధికారులు విచారించారు.
ఆయ న ఇచ్చిన డాక్యుమెంట్లు కేసు పురోగతిలో ఎంతో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగానే కేటీఆర్, అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీచేస్తారని సమాచారం. రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేయగా.. నాటి మం త్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఏ1గా పేర్కొం టూ ఏసీబీ కేసు నమోదు చేసింది.
పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, అప్పటి హెఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి ఏ3గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. రేస్‌లో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై ఏసీబీ విచారిస్తోందని సమాచారం.
దానకిషోర్ ఇచ్చిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అంశాలపై రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంతో పాటు అరెస్టుకు సంబంధించిన అంశాలపైనా ఏసీబీలో కీలకమైన మథనం జరుగుతోందని సమాచారం.
అయితే ఏసీబీ నుంచి ఎలాంటి లీకులు లేకుండా చూసేందు కు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించారనే అంశంపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.