మాజీ వైస్ ఎంపీపీ వీరభద్రం...
మణుగూరు (విజయక్రాంతి): ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై చేస్తున్నది ఉద్దేశపూర్వకమే అని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన నిందారోపణలు చేస్తుందే తప్ప నిజాలు ఎంత మాత్రం లేవని అశ్వాపురం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం ఖండించారు. కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ పై మోపిన అబద్ధాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట తప్పుతూ, ప్రతీ హామీని విస్మరిస్తూ.. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గద్దెల రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి చుంచు రామ్మూర్తి, యూత్ నాయకులు శెట్టిపల్లి శేఖర్, ఇసంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.