calender_icon.png 29 November, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి ఫార్ములా కార్ రేసింగ్

30-10-2024 02:00:12 AM

  1. రూ.55 కోట్ల గోల్‌మాల్‌పై ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు  
  2. నిబంధనలను ఉల్లంఘించి విదేశీ సంస్థకు నిధులు
  3. విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ

 హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిధుల గోల్‌మాల్ అంశం మళ్లీ తెరపైకి వచ్చిం ది. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ  రూ.55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీచేయడం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారి తీసింది.

తాజాగా ఈ వ్యవహారంపై మున్సిపల్ శాఖ అధికారులు మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. పోటీల నిర్వహణకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడం, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది.

ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించక పోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సెషన్ 10 రద్దయ్యింది.  ఇదిలాఉండగా దీపావళి లోపు పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

గత ప్రభుత్వ హయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు ఒక్కొక్కటికి బయటకు వస్తుండటం కలకలం రేపుతోంది. మొన్న అమోయ్‌కుమార్ భూదాన్ భూముల వ్యవహారం.. నిన్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీ.. ప్రస్తుతం ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల గోల్‌మాల్ బయటపడటం చర్చనీయాంశంగా మారుతుంది.  

గతేడాది ఫిబ్రవరి 11న తొలి రేసింగ్  

గతేడాది ఫిబ్రవరి 11న హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌లో మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీ జరిగింది. సీజన్-9 ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎం డీఏ రూ.20 కోట్లు ఖర్చుచేసింది.

ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్-10) నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ (ఎఫ్‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదు ర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేట్ సంస్థలైన గ్రీన్‌కో, ఫార్ములా-ఈనే భరించాల్సి ఉంది.

కానీ, గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్‌కో సంస్థను తొలగించి దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఇటు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే సదరు ఉన్నతాధికారి ఈవెంట్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్ల ముందస్తు చెల్లింపులు చేశారు. 

సెషన్-10 జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై 200 కోట్ల భారం 

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం సెషన్-10 రద్దయ్యింది. ఫిబ్రవరి 10న ఈవెంట్ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది.

కానీ, ఇంతలో విషయం బయటపడడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఫార్ములా ఈ రేసుపై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా ఈ రేసింగ్‌లో నిధు ల గోల్‌మాల్‌పై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది.