ఒకే చోట కార్యాలయాలు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడి
మునుగోడు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మునుగోడు నియెజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, మునుగోడు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల సంత, పోలీస్‌స్టేషన్ భవనం, ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఒకే చోట ఉండేలా అవసరమయ్యే స్థలం కోసం కాలినకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఒకే ప్రాంగంణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని ఇంటిగ్రేటెడ్, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు.