calender_icon.png 31 March, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ ముస్లింలు బాయ్ బాయ్

29-03-2025 12:58:55 AM

ఇఫ్తార్ విందులో మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి

కాల్వ శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మసీదులో తాజా మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో  శుక్రవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అంటూ తిరుపతిరెడ్డి సూచించారు. కులమతాలకతీతంగా అందరూ కలిసి ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆడేపు శ్రీదేవి రాజు, ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, కో ఆప్షన్ ఎండి. ఇబ్రహీం, మాజీ ఎంపీటీసీ ధూపం సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ జక్క రవి, ఎండి గోర్మియా,  వార్డ్ మెంబర్ రాయమల్లు, ఎండి ఫకీర్, రహీం, తదితరులు పాల్గొన్నారు.