calender_icon.png 20 April, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

09-04-2025 05:18:06 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): వేమనపల్లి మండలంలోని కల్లంపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లను బుధవారం మాజీ జెడ్పిటిసి రుద్రభట్ల సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీలు ముగ్గు పోసి ప్రారంభించారు. లబ్ధిదారులు పనులను ప్రారంభించిన వెంటనే వారికి దశలవారీగా ప్రభుత్వం నుండి నగదు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భీమనపల్లి ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, వేమనపల్లి కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ముల్కల సత్యనారాయణ, ముజ్జు, ఒడిలా రాజన్న, కొమరం రమేష్, కుమ్మరి శ్రీనివాస్, మధుసూదన్, లక్ష్మణ్ లు పాల్గొన్నారు.